విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ట్రీట్‌మెంట్ కొనసాగిస్తున్నాం అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Tags :