మళ్ళీ వెండితెర పై ఒకప్పటి లవర్ బాయ్...

మళ్ళీ వెండితెర పై ఒకప్పటి లవర్ బాయ్...

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకి పరిచయమై , తర్వాత మోస్ట్ రొమాంటిక్ , యూత్ ఎంటర్టైనర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకి లవర్ బాయ్ గా దగ్గరయ్యాడు హీరో తరుణ్. ఒకప్పుడు తరుణ్ సినిమాలకి ఫుల్ క్రేజ్ ఉండేది. నువ్వే కావాలి సినిమా అయితే అప్పట్లో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఉర్రుతలూగించింది.

తరుణ్ కి బ్యాక్ తో బ్యాక్ హిట్స్ పడి మంచి బూస్ట్ ఇచ్చాయి. చూస్తుండగానే లవర్ బాయ్ ఇమేజ్ తో ఒక రేంజ్ కి వెళ్ళిపోయాడు ఈ హీరో. ఇక తరుణ్, ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీలో హిట్ అండ్ హాట్ పెయిర్ అన్న విషయం తెలిసిందే. అతనితో సినిమాలు చేసేందుకు బడా నిర్మాతలు ఇంటి చుట్టూ క్యూ కట్టారనడంలో అతిశయోక్తి లేదు.

కాలం ఎప్పుడు అందరికీ ఒకేలా ఉండదు . వరుస డిజాస్టర్ సినిమాలతో తరుణ్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. కొంత కాలం తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్  అవ్వలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ లవర్ బాయ్ తన సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నాడు.

తరుణ్ కి బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని అతను క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త చురుగ్గా ఉంటున్న తరుణ్, తన రెగ్యులర్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నాడు.

రీసెంట్ గా అతను స్టైలిష్ లుక్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటోని చుసిన నెటిజన్స్ ఒకప్పటి లవర్ బాయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, మళ్ళీ సినిమాల్లోకి రావొచ్చుగా అని కామెంట్స్ చేస్తున్నారు.తరుణ్ కూడా మళ్ళీ తన కెరీర్ ని రీస్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది.

అయితే ఈ జెనెరేషన్ కి నచ్చే కంటెంట్ దొరకట్లేదని సమాచారం. మంచి కంటెంట్ దొరికితే మాత్రం సినిమా తీస్తానన్నారు. ఇటీవల నువ్వే నువ్వే సినిమా కి సంబంధించిన రీ రిలీజ్ ప్రోగ్రాం లో తరుణ్ కనిపించి ప్రేక్షకులని అలరించారు. సినిమాలపై అయితే అతనికి మక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. 

 

 

Tags :