టాస్ దీపావళి సంబరాలు - 2021

టాస్ దీపావళి సంబరాలు - 2021

తెలుగు అసోసియేషన్ అఫ్ స్కాట్లాండ్, UK వారు  ప్రతి ఏటా నిర్వహించే దీపావళి సంబరాలను ఈసారి స్కాట్లాండ్ తెలుగు ప్రజల సమక్షంలో క్రమండ్ కిర్క్ హాల్, ఇడిన్ బరో (EDINBURGH, UK) లో 06-11-2021 న  జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మన తెలుగు వారు ఆహ్లాదంగా ఆనందంగా వయోభేదం లేకుండా తమ సాంస్కృతిక కార్యక్రమములను ప్రదర్శించి ఆహూతులను అలరించారు.

ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్ లో ఉన్న తెలుగు వారిని, వివిధ భాషలకు సంబంధించిన ప్రతినిధులను మరియు పూర్వ టాస్ కార్యవర్గ సభ్యులను సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ పర్రి గారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం సాంస్కృతిక  కార్యదర్శి  శ్రీ నిరంజన్ నూక గారు మరియు స్పోర్ట్స్ కార్యదర్శి శ్రీ సాయి చైతన్య ప్రత్తిపాటి నిర్వహణలో జరగగా, సంధానకర్తలుగా శ్రీమతి  భవాని చిటికిరెడ్డి, కుమారి వైష్ణవి శ్రీనివాస్ మరియు  మాస్టర్ రిత్విక్ గాలి తమదైన శైలిలో వ్యాఖ్యానంతో అందరిని ఉత్సాహపరిచారు. టాస్ చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి గారు ప్రసంగిస్తూ COVID -19 తరువాత మరల తెలుగు ప్రజలందరిని కలుసుకొని ఇలా ఘనంగా కార్యక్రమం జరుపుకోవటం చాల ఆనందంగా ఉంది అని చెప్పి, అతిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్కాట్లాండ్ లో ఉన్న తెలుగు ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియ చేశారు. అధ్యక్షులు శ్రీ శివ చింపిరి గారు ప్రసంగిస్తూ గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు టాస్ చేసిన కార్యక్రమములను అందరికి విశ్లేషించారు. అలాగే పూర్వ కమిటీ సభ్యులకు మరియు వాలంటీర్స్ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు. కోశాఖాధికారి శ్రీ వెంకటేష్ గడ్డం, మహిళా కార్యదర్శి శ్రీమతి మాధవి అప్పరాల గార్లు ఈవెంట్ మొత్తం సజావుగా జరిగేలా అందరిని సమన్వయపరచి కార్యక్రమం చక్కగా నిర్వహించడంలో సహాయపడ్డారు. ఇంకా నిరంజన్ గారు మాట్లాడుతూ టాస్ నిర్వహించే కార్యక్రమాలను ఆదరిస్తున్నందుకు తెలుగు వారందరికీ ధన్యవాదములు తెలియజేశారు, ఇలాంటి కార్యక్రమములను మున్ముందు ఇంకా ఘనంగా జరుపుకోవాలి అని ఆకాంక్షించారు. చివరగా జనరల్ సెక్రెటరి శ్రీ ఉదయ్ కుమార్ కూచడి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసి మరలా కలుసుకుందాం అని చెప్తూ మన జాతీయగీతం జనగణమనతో కార్యక్రమానికి ముగింపు పలికారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన సాంస్కృతిక ప్రదర్శనలను ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించండి.

https://www.youtube.com/playlist?list=PLyfqb0NNqxgK1zmvsn-Hn9W-AVfscvT9b

Click here for Event Gallery

 

Tags :