ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో

ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో

ఎయిర్‌ ఇండియాకు కొత్త సీఈవో వచ్చేశారు. ఎయిర్‌ ఇండియా సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యాంపెబెల్‌ విల్సన్‌ను నియమిస్తూ టాటా సన్స్‌ పేర్కొన్నది. సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ గ్రూపులో గతంలో విల్సన్‌ పని చేశారు. దాంట్లో ఆయనకు 15 ఏళ్ల అనుభవం ఉన్నది. జపాన్‌, కెనడా, హాంగ్‌కాంగ్‌ దేశాల్లో ఆయన పనిచేశారు. 1996లో ఎస్‌ఐఏలో మేనేజ్మెంట్‌ ట్రైనీగా తన కెరీర్‌ ప్రారంభించారు. టాటా గ్రూపునకు చెందిన విస్తారాకు ఎస్‌ఐఏ భాగస్వామిగా ఉంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధ సంస్థ అయిన స్కూట్‌లో సీఈవోగా చేశారు. న్యూజిలాండ్‌లోని క్యాట్‌బరీ వర్సిటీ నుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన మాస్టర్స్‌ పట్టా పొందారు. ఎయిర్‌ ఇండియా సంస్థను గత ఏడాది టాటా గ్రూప్‌ టేకోవర్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

క్యాంపెబెల్‌ నియామకాన్ని ఎయిర్‌ ఇండియా చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగంలో ఆయనో కీలక వ్యక్తి. ఆయన అనుభవం ఎయిరిండియాకు అదనపు ప్రయోజనం. ఆయనతో కలిసి ఈ సంస్థను ప్రపంచ ప్రమాణికంగా తీర్చిదిద్దేందుకు ఎదురుచూస్తున్నాం అని ఆనందం వ్యక్తం చేశారు.

 

Tags :