టీసీఎస్ మరో రికార్డు సంచలనం.. ప్రపంచంలోనే!

టీసీఎస్ మరో రికార్డు సంచలనం.. ప్రపంచంలోనే!

ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మరో రికార్డు సాధించింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ 2022 గ్లోబల్‌ 500 నివేదిక ప్రకారం టాటా కన్సల్టెన్నీ సర్వీసెస్‌ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్‌ అత్యంత విలువైన బలమైన ఐటీ సేవల అందిస్తున్న బ్రాండ్‌గా కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌ గత సంవత్సరం నుంచి 52 శాతం వృద్ధి చెందింది. 12.8 బిలియన్లతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సేవల బ్రాండ్‌గా అవతరించింది. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక కంపెనీ ఐబీఎంను సైతం మన దిగ్గజాలు వెనక్కి నెట్టాయి.

 

Tags :