టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

ఆఫీసులకు వచ్చే ఉద్యోగులకు  ఐటీ దిగ్గజం టీసీఎస్‌  బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కోవిడ్‌ తరువాత క్రమంగా వర్క్‌ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికిన మేజర్‌ కంపెనీలన్నీ ఉద్యోగులకు ఆఫీసులకు రప్పించేందుకు నానా కస్టాలు పడుతున్నాయి. ఆఫీసు నుండే పని చేసేలా ఉద్యోగులను ప్రేరేపించేందుకు వారు కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నాయని హెచ్‌ఆర్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో టీసీఎస్‌ ఉద్యోగులను ఆఫీసు నుంచి పనిచేసేలా చేసేందుకు ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఉద్యోగులు ఆఫీసు నుండి పనిచేసే రోజులకు పాయింట్లను చేర్చనుంది. అఫ్రైజల్‌ సిస్టమ్‌లో వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ పాయింట్‌ను అందించనుంది. ఈ మేరకు  కంపెనీలోని మేనేజర్‌లు, టీమ్‌ లీడ్‌లకు ఈమెయిల్‌ పంపించినట్టు తెలుస్తోంది. టీమ్‌ మెంబర్‌లందరికీ ఈ కింది ఆర్‌టీవో (రిట్నర్‌ టు ఆఫీసు)కు వచ్చేలా చూడాని కోరింది. తమ టీం సభ్యులు వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులకు రావాలని కోరుతోంది. 

 

 

Tags :