MKOne TeluguTimes-Youtube-Channel

టీసీఎస్ కు కొత్త సీఈవో

టీసీఎస్ కు కొత్త సీఈవో

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఎండీ రాజేష్‌ గోపీనాథన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కంపెనీ వెటరన్‌ కె. కృతివాసన్‌ కొత్త సీఈవోగా నియమితులయ్యారు. సంస్థ బ్యాంకింగ్‌, పైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ ( బీఎఫ్‌ఎస్‌ఐ) బిజినెస్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ హెడ్‌గా ఉన్న కృతివాసన్‌  కొత్త సీఈవోగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కృతివాసన్‌ మీడియా మాట్లాడుతూ టీసీఎస్‌ సీఈవోగా కంటే, చెన్నై వదిలి ముంబైకి మారడమే పెద్ద సవాల్‌ అని అన్నారు. మార్కెట్లో వచ్చే ప్రతి సవాల్‌ ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. టాప్‌ ఇండియన్‌ ఐటీ కంపెనీ సహచరులతో పోలిస్తే చాలా ఆలస్యంగా 58 ఏళ్లకు  కీలక పదవి ఎంపికయ్యారు అనేది నిపుణుల మాట.

 

 

Tags :