టిడిఎఫ్‌ (యుఎస్‌ఎ) ఆధ్వర్యంలో మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 10 లక్షల విలువైన ఆక్సిజన్‌ ఇతర పరికరాల పంపిణీ

టిడిఎఫ్‌ (యుఎస్‌ఎ) ఆధ్వర్యంలో మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 10 లక్షల విలువైన ఆక్సిజన్‌ ఇతర పరికరాల పంపిణీ

తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్‌, యుఎస్‌ఎ సంస్థ ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన 10 లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్‌ బెడ్‌ వింగ్స్‌, ఆక్సిజన్‌ ఫ్లో లైన్స్‌ ను జిల్లా కలెక్టర్‌ శ్రీమతి హరిచందన దాసరి, టిడిఎఫ్‌ యుఎస్‌ఎ అధ్యక్షులు కవిత చల్లా, ఉప-అధ్యక్షులు ప్రీతి రెడ్డి, సర్పంచ్‌ అరుణ చేతుల మీదుగా ప్రారంభించారు. 

తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్‌ యుఎస్‌ఎ సంస్థ కోవిడ్‌ రిలీఫ్‌ ప్రాజెక్ట్‌ లో బాగంగా కలెక్టర్‌ సూచన మేరకు విరాళంగా మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు10 లక్షల విలువ గల ఆక్సిజన్‌ బెడ్స్‌ తో పాటు వైద్య సిబ్బందికి  మాస్కులు, శానిటైజర్లు, ఫేస్‌ శేల్డ్‌, ఇన్ఫ్రారెడ్‌ ధర్మామీటర్లు, పిపిఇ కిట్సు, పల్స్‌ అక్సి మీటర్లు మొదలుగునవి ఉదారంగా పంపిణీ చేయటం జరిగింది. వీటిని ఉదారంగా ఏర్పాటు చేసిన టిడిఎఫ్‌ యుఎస్‌ఎను కలెక్టర్‌ అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలియజేశారు, ఇక ముందు కూడా నారాయణ పేట జిల్లా అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమానికి టిడిఎఫ్‌ యుఎస్‌ఎ అధ్యక్షులు కవిత చల్లా, ఉపాధ్యక్షులు ప్రీతి రెడ్డి, మాజీ అధ్యక్షులు మురళి చింతలపాణి మరియు టిడిఎఫ్‌ ఇండియా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ శివంత్‌ రెడ్డి, మట్ట రాజేశ్వర రెడ్డి, కరకల కృష్ణారెడ్డి, అనుపమ రెడ్డి, కృష్ణా రెడ్డి, డాక్టర్‌ శైలజ డిఎల్‌ఓ డాక్టర్‌ రాఘవేందర్‌ మండల స్పెషల్‌ అఫీసర్‌ కృష్ణమాచారి సర్పంచి అరుణ ఎంపి పి విజయలక్ష్మి, జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

Click here for Photogallery

 

 

Tags :