ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధనఖడ్‌కు టీడీపీ మద్దతు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధనఖడ్‌కు టీడీపీ మద్దతు

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్‌ ధనఖడ్‌కు మద్దతు పలకాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, ధన్‌ఖడ్‌ను కలిసి మద్దతు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోరిన నేపథ్యంలో మద్దతు తెలిపినట్లు కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. సీనియర్‌ న్యాయవాది, చట్టసభల సభ్యుడిగా, గవర్నర్‌గా పని చేసిన ధన్‌ఖడ్‌ అనుభవం దేశానికి పనికొస్తుందనే ఉద్దేశంతోనే ఆయన్ను కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.

 

Tags :