టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్

టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాను కరోనా బారిన పడినట్లు చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా వెల్లడిరచారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు. జాగ్రత్త వహించండి, సురక్షితంగా ఉండండి అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

 

Tags :