ప్రజా స్పందన ఎంతో అద్భుతం : చంద్రబాబు

ప్రజా స్పందన ఎంతో అద్భుతం : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడు రోజుల జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగిందని తెలిపారు. మూడు రోజుల నా జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగిందన్నారు. ఏడు జిల్లాల్లో 21 నియోజకవర్గాల్లో  లక్షల మందికి చేరువగా పర్యటన సాగిందని వివరించారు. బాదుడే బాదుడుపై ప్రజల ఆవేదన ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయని తెలిపారు. ప్రజల మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ప్రజల్లో టీడీపీపై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయని పేర్కొన్నారు. వెల్లువలా కదిలి స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పర్యటనలకు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చిందన్నారు.

 

Tags :