ఆదాయం పెరుగుతున్నా.. అప్పులు ఎందుకు ?

ఆదాయం పెరుగుతున్నా.. అప్పులు ఎందుకు ?

వైసీపీ పెద్దల అవినీతి, ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోందని టీడీపీ నేత అశోక్‌బాబు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదాయం పెరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు అప్పలు చేస్తోంది? అని ప్రశ్నించారు. జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. 1న జీతాలు ఇప్పించలేని ఉద్యోగ సంఘాల నేతలతో లాభమేంటి? అని ప్రశ్నించారు.  ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థలో ఇబ్బందులున్నాయని సాకు చూపుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెండింగ్‌లో పెడుతున్నారని చెప్పారు. నవంబర్‌లో రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు కూడా డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. మూడు నెలలుగా అంగన్వాడీలకు వేతనాలు లేవని తెలిపారు.

 

Tags :