రూల్స్‌కు వ్యతిరేకంగా వెళ్లినవారికి ఇబ్బందులు : అచ్చెన్నాయుడు

రూల్స్‌కు వ్యతిరేకంగా వెళ్లినవారికి ఇబ్బందులు : అచ్చెన్నాయుడు

మహిళను పోలీసులు జీపుతో తొక్కించారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మేయర్‌ కఠారి హేమలతపై పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే చంపేందుకు కూడా వెనకాడటం లేదన్నారు. అధికారపార్టీ అరాచకాలకు పోలీసులు ఎంతలా వత్తాసు పలుకుతున్నారో ఈ ఘటనే నిదర్శనమన్నారు. బాధితులపైనే తిరిగి కేసులు పెట్టి బెదిరించాలనుకోవడం దుర్మార్గమన్నారు. వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారని వాపోయారు. పోలీసుల భుజాలపై తుపాకీ పెట్టి టీడీపీని బెదిరించాలనుకోవడం సరికాదన్నారు. ఘటనపై పోలీసు శాఖ స్పందించాలన్నారు. రూల్స్‌కు వ్యతిరేకంగా వెళ్లినవారికి ఇబ్బందులు తప్పవని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని అన్నారు.

 

Tags :