అనంతపురంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

అనంతపురంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

అనంతపురంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జిల్లాలోని టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారిని గృహ నిర్బంధం చేస్తున్నారు. వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అక్రమంగా సుజలాన్ భూములను కొనుగోలు చేశారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు ఆ భూములను పరిశీలించేందుకు వెళతామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. శనివారం భూముల పరిశీలనకు బయలుదేరడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితులు చేయి దాటకుండా ఉండేందుకు పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్‌ కూడా చేస్తున్నారు. ఇప్పటికే కల్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి సహా పలువురు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కల్యాణదుర్గం వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు.

 

 

Tags :