పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు

పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బ్యానర్‌ పట్టుకుని అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  ప్రజలకు భారంగా మారిన పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.  వైకాపా పాలనలో సామాన్యులు చితికి పోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు కూడా అధికంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

 

Tags :