టీడీపీ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం

టీడీపీ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్నదాతలకు అండగా నిలబడేందుకు టీడీపీ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం పేరుతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని విమర్శించారు.  అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటించి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని వెల్లడిరచారు.

 

Tags :