పోలీసు శాఖ వైఫల్యాలను త్వరలోనే కేంద్ర సంస్థలకు

పోలీసు శాఖ వైఫల్యాలను త్వరలోనే కేంద్ర సంస్థలకు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు శాఖ వైఫల్యాలను త్వరలోనే కేంద్ర సంస్థలకు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్‌ దందాపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు పంపడం ఏ మేరకు సబబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలను కాపాడేందుకు నోటీసులు పంపారా అని ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పాలంటూ పోలీసులు పంపిన నోటీసులు చిత్తుకాగితాలతో సమానమన్నారు. డ్రగ్స్‌ దందాపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా నిలదీశామన్నారు.  క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించి తీరుతామన్నారు.

 

Tags :