అమ్మ ఒడి పథకం నాన్న బుడ్డికే : పట్టాభి

అమ్మ ఒడి పథకం నాన్న బుడ్డికే : పట్టాభి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం నాన్న బుడ్డికే సరిపోతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడికి రూ.12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా అందులో సగం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. 2021లో అసలు అమ్మఒడి ఇవ్వలేదని, ఇప్పుడు ఇచ్చినా అందులో సగం కోత పెడుతున్నారని అన్నారు. అనాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ ఇస్తామని జగన్‌ చెప్పినట్లు గుర్తు చేశారు. నాడు నేడు కార్యక్రమం పేరుతో రూ. వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుంటే 2 లక్షల మంది పదో తరగతి పిల్లలు ఎలా ఫెయిల్‌ అయ్యారని ప్రశ్నించారు.

 

Tags :