జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి.. ఎందుకు భయం ? :పట్టాభి

జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి.. ఎందుకు భయం ? :పట్టాభి

జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పండ, ఎందుకు భయం? అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారని అన్నారు. బారికేడ్లు లేకుండా, దుకాణాలు మూసివేయకుండా జనంలోకి వెళ్లాలన్నారు.  జగన్‌ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అరాచకప్రదేశ్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ రెడ్డి ప్రజాదరణ ఉంటే బారికేడ్లు, వేలాది పోలీసులు ఎందుకు ? అని నిలదీశారు. జగన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి  రేటు పాతాళానికి చేరిందన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ దయనీయ పరిస్థితికి ఆర్‌బీఐ నివేదికే నిదర్శనమని తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.