రేపటి నుంచి రైతు కోసం తెలుగుదేశం

రేపటి నుంచి రైతు కోసం తెలుగుదేశం

రైతు గెలవాలి-వ్యవసాయం కలకాలం నిలవాలనే అజెండాతో తెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతన్నలు విత్తనం నాటే దగ్గర్నుంచి, పంట ఉత్పత్తుల విక్రయం వరకు అడుగడుగునా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని అన్నారు. ఈ ప్రభుత్వంలో వ్యవసాయమంటేనే రైతులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 

అడుగడుగునా రైతుకు ఉరివేసేలా ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగా ఈ నెల 14 తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాష్టంగా రైతు కోసం తెలుగుదేశం  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

 

Tags :