పట్టభద్రుల స్థానాల్లో టీడీపీదే పైచేయి

తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. తొలి ప్రాధాన్యత పోలింగ్‌లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ భారీ మెజార్టీతో దూసుకుపోయారు. ఈ స్థానానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డికి 85,252 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌కు 1,12,514 ఓట్లు లభించాయి. దీంతో 27, 262 ఓట్ల మెజార్టీతో టీడీపీ తూర్పు రాయలసీమ స్థానంలో గెలపొందినట్లుయింది. ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యేట్ స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి వీ చిరంజీవిరావు 26,843 ఓట్ల మెజార్టీతో మొదటి స్థానంలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ 54,379 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. పీడీఎఫ్ అభ్యర్థి 33,654 ఓట్లతో మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి ప్రాధాన్యత లో ఆధిపత్యాన్ని చలాయించిన టీడీపీ అభ్యర్థి చిరంజీవినే విజయం వరించింది.