వారు అంతా గమనిస్తున్నారు.. ఏదో ఒక రోజు

వారు అంతా గమనిస్తున్నారు.. ఏదో ఒక రోజు

అధికారంలోకి రాకముందు అమరావతే రాజధాని అని, అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానులు అని అంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేత యరపతినేని శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కిందిస్థాయి నాయకుల నుంచి సీఎం వరకూ ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజలను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలన్నారు. ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె మృతిపై విమర్శలు చేసే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేశారు.  కుల, మత రాజకీయాలను సీఎం జగన్‌ పెంచి పోషిస్తున్నారు.

మహిళలను వేధిస్తూ దొరికిపోయిన ఎంపీ ఓ వర్గాన్ని నిందిస్తారా? వైసీపీకి గోరంట్ల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  వైసీపీ ప్రభుత్వానికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఎంపీ గోరంట్ల మాధవన్‌ను సస్పెండ్‌ చేయాలన్నారు.  పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. దుర్గామాతలుగా మారి రాష్ట్రాన్ని మహిళలే కాపాడుకోవాలి. చేతిలో అధికారం ఉంది కదా అని అహంకారంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వారు అంతా గమనిస్తున్నారు. ఏదో ఒక రోజు సరైన మాధానం చెబుతారు. వైసీపీకి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు.

 

Tags :