అమెరికాలో దారుణం.. నల్గొండ వాసి మృతి

అమెరికాలో దారుణం.. నల్గొండ వాసి మృతి

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మేరీల్యాండ్‌ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నల్గొండ యువకుడిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నల్గొండ వాసి నక్క సాయి చరణ్‌ (26) మృతి చెందారు. తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయులు కాల్పులు జరిపారు. దీంతో సాయి చరణ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న తల్లిదంద్రులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. సాయి మృతితో నల్గొండలో విషాదఛాయలు అలముకున్నాయి. సాయిచరణ్‌ అమెరికాలో రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.

 

Tags :