బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న

బీజేపీలో చేరిన తీన్మార్  మల్లన్న

ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహäల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ ఆయనకు కాషాయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీన్మార్‌ మల్లన్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్నార్‌ మల్లన్న మాట్లాడుతూ నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు, 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్‌, కేటీఆర్‌ కవిత, హరీశ్‌రావును కట్టేస్తా. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్‌. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే నేను ఢిల్లీకి వచ్చా. నాపై 38 కేసులు పెట్టారు. అయినా ఏం సాధించారు? పోలీసులు బాధపడ్డారు, జడ్జీలు మదనపడ్డారు. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్‌పై పోరాడతాం అని తెలిపారు.

 

Tags :