అమెరికా లో గాయపడిన తెలుగు విద్యార్థులకు తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం సహాయం

అమెరికా లో గాయపడిన తెలుగు విద్యార్థులకు తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం సహాయం

అమెరికాలో కనెక్టికట్‌ రాష్ట్రంలోని సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ లో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ఇటీవలే జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అమెరికా లోని ఆసుపత్రులలో హెల్త్ ఇన్సూరెన్స్ లేకున్నా, ఉద్యోగం లేకున్నా భారీగా ఖర్చు వస్తుంది..వైద్య భీమా లేని సందర్భాలలో ఆసుపత్రులు సైతం వైద్యం అందించటానికి అంత సుముఖత చూపించవు.

ఇలాంటి సమయం లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) వారు ఈ విద్యార్థుల విషయం తెలుసుకుని వెంటనే వాళ్లతో మాట్లాడి మీకు మేమున్నాం అని భరోసా ఇచ్చి, డాక్టర్స్ తో మాట్లాడి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన సహకారం అందించటానికి ముందుకు వచ్చారు.

అయితే ఈ ఇద్దరు విద్యార్థులకి అమెరికాలో తెలిసిన వారు లేకపోవటం, ఆసుపత్రి చికిత్స సమయంలో సహాయకులు లేక ఇబ్బందులు పడటం, అలాగే హాస్పిటల్ ఖర్చులు కూడా అధికమౌతుండటంతో  ఆసుపత్రి వర్గాలు మరియు వైద్యులు  సైతం  ఇండియా వెళ్లి అక్కడ ఫిజికల్ థెరపీ చేపించుకోమని సలహా ఇచ్చారు.

అయితే విద్యార్థులకి  ప్రస్తుత  పరిస్థితి లో క్షేమంగా విమాన ప్రయాణం చెయ్యాలంటే, వారు ఎట్టి పరిస్థితులలోను బిజినెస్ క్లాస్ టికెట్స్ తో మాత్రమే ప్రయాణం చెయ్యాలని వైద్యులు సూచించారు. కానీ విద్యార్థుల దగ్గర అంత డబ్బు లేకపోవటంతో పరిస్థితిని అర్ధం చేసుకుని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు కావాల్సిన డబ్బు సుమారు మారు పదిహేను వేల డాలర్లు (సుమారు పదిలక్షల రూపాయలను)  సమకూర్చి ఆ ఇద్దరు విద్యార్ధులకి బిజినెస్ క్లాస్ లో టిక్కెట్లను కొని క్షేమంగా హైద్రాబాదుకు పంపించారు. అలాగే వాళ్ళు పూర్తిగా కొలుకున్నాక మళ్లీ అమెరికా తిరిగి వచ్చి వాళ్ళ చదువులు కొనసాగేలా అధికారులతో మాట్లాడారు. అంతే కాకుండా తిరుగు ప్రయాణం టిక్కెట్లు కూడా కొనిచ్చారు.

ఈ సందర్భం గా ఆ ఇద్దరు విద్యార్థులు మాట్లాడుతూ, మేము ఎవరో తెలువకున్నా, తెలుగు వారు అనే మమకారం తో సహాయం చెయ్యడానికి ముందు వచ్చిన తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం సంస్థకు, వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి గారికి, అధ్యక్షులు మోహన్ పటలోళ్ళ గారికి మరియూ మాకు అన్నివిధాలా సహాయం అందించిన టిటిఎ కమ్యూనిటీ సర్వీసెస్ కోర్ టీం కి, ఇతర సంస్థ పెద్దలందరికి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేసిన సహాయం మా జీవితం లో మరిచిపోలేమని  తెలిపారు. అయితే తెలంగాణా అమెరికన్ తెలుగు అసోషియేషన్ కమ్యూనిటీ సర్వీసెస్ విభాగం  అమెరికా లో వున్న తెలుగు వాళ్లందరికి ముఖ్యానంగా విద్యార్థులకి యెనలేని సేవలందిస్తోందని, వారి పరిధి మేరకు ఎంతో సహాయం చేస్తు మంచి పేరు తెచ్చుకున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 

Tags :