22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ?

22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‍ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై ఒకటి, రెండు రోజుల్లో  గవర్నర్‍ తమిళిసైను ముఖ్యమంత్రి కేసీఆర్‍ కలవనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్‍తో ముఖ్యమంత్రి కేసీఆర్‍ చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ  నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల కంటే ముందు రాష్ట్ర కేబినెట్‍ భేటీ కానుంది.

 

Tags :