ఢిల్లీకి రాష్ట్ర బీజేపీ నేతలు.. తాజా పరిణామాలపై చర్చ..

ఢిల్లీకి రాష్ట్ర బీజేపీ నేతలు.. తాజా పరిణామాలపై చర్చ..

తెలంగాణ బీజేపీ నేతలు హస్తినకు ప్రయాణం అవుతున్నారు. వీరితో పాటు తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులుగా శశిదర్ రెడ్డి కాంగ్రెస్‌కు వీడి కమలం పార్టీ కండువా కప్పుకునేందుకు చూస్తున్నారని వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. వాటిని నిజం చేసే విధంగానే మర్రి శశిధర్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయనకు బీజేపీ కండువా కప్పేందుకు ఢిల్లీ పయనమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల, వివేలు సహా పలువురు నేతలు ప్రయాణం అవుతున్నారు. ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి చేరనున్నారని సమాచారం. అనంతరం ప్రస్తుతం తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులతో రాజకీయలు హీటెక్కుతున్నాయి. వీటిపై బీజేపీ కేంద్ర నేతలతో రాష్ట్ర నేతలు చర్చించనున్నారని, వాటితో పాటు తాజా రాజకీయాల పరిస్థితులపై సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.