11న తెలంగాణ కేబినెట్ భేటీ

11న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్‌లో 3 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే  రుణాల్లో కేంద్రం కోత విధించింది. రూ.53వేల కోట్లలో కేంద్రం రూ.15 వేల కోట్లు కోత విధించిందని ఇటీవల సీఎం తెలిపారు. దీంతో పాటు ప్రాజెక్టులు సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి. దీంతో ప్రత్నామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కొత్త ఫించన్లు, డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథపిల్లల సంక్షేమం కోసం చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల సహా ఇతర అంశాలపై కేబినెట్‌ చర్చింనుంది. శాసనసభ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలపై కూడా చర్చించనున్నారు. వీటితో పాలనాపరమైన అంశాలు, రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక, పార్టీ వ్యూహం, సంబంధిత అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

 

Tags :