ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాల నిర్వహణతో పాటు దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు అములుపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25 లోగా ఉభయసభలు సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఆ లోగా సమావేశాలను ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నారు. దళితబంధు పథకం రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నది.  మరో నాలుగు గ్రామాల్లోనూ పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే.  మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

Tags :