MKOne Telugu Times Business Excellence Awards

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో తీన్మార్ సంక్రాంతి ఘన వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్  టొరంటో లో  తీన్మార్ సంక్రాంతి ఘన వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో 15 జనవరి, 2022 శనివారం రోజున తీన్మార్ సంక్రాంతి 2022సాంస్కృతిక వర్చ్యువల్  ఉత్సవాలు కెనడా టొరంటో లో ఘనంగా జరుపుకున్నారు.   ఈ సంబరాలలో 200 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.   సహాయ కార్యదర్శి శ్రీ జితేందర్ వారి ధర్మ పత్ని కాంతి గారు దీప ప్రజ్వలన చేసి తీన్మార్ సంక్రాంతి 2022 సంబరాలను ప్రారంభించారు.

ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ Executive Committe ఆధ్వర్యంలో, Board of Trustee మరియు Foundation Committe సభ్యులు సహకారంతో విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమములో భోగి పళ్ళు,  పిల్లలు సంప్రదాయ వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు, ఈ ముగ్గుల పోటీలకు శ్రీమతి ఉమా సలాడి గారు, శ్రీమతి జయ కందివనం గారు జడ్జెస్ గా వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా కన్సుల్టే జనరల్ టొరంటో లో శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవగారు TCA 2022   క్యాలెండరును ఆవిష్కరించి  ముగ్గులపోటీలను తిలఖించారు. మరియు టొరంటో లోని తెలుగు వారికి TCA వారు చేసే కమ్యూనిటీ సర్వీస్ లను కొనియాడారు.

కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సహకరించి  కెనడాలో సంక్రాతి సంబరాలను ఘనంగా నిర్వర్తించారు

రాజేష్, ప్రెసిడెంట్ టొరంటో కెనడా తెలంగాణ అసోసియేషన్ మాట్లాడుతూ - ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన భారత సాంప్రదాయ పటుత్వాన్ని నెలకొల్పాలని మన తెలుగు సాంప్రదాయ సంరక్షణ లో భాగం కావాలని కోరుతున్నారు.

Click here for Photogallery

 

 

Tags :