గాంధీ ఆస్పత్రిలో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ చేసిన కేసీఆర్

గాంధీ ఆస్పత్రిలో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ చేసిన కేసీఆర్

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మహాత్ముని విగ్రహావిష్కరణ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు ఎంజీ రోడ్‌లో మహాత్ముడి విగ్రహానికి కూడా కేసీఆర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.