టీ హబ్ -2ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

టీ హబ్ -2ను  ప్రారంభించిన సీఎం కేసీఆర్

టీ హబ్‌ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. టీ హబ్‌-2 ప్రాంగణమంతా కేసీఆర్‌ కలియ తిరిగారు. టీ హబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ప్రత్యేకతలను అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.276 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించింది. 53.65 మీట్ల ఎత్తులో (రెండు బేస్‌మెంట్లు, 10 అంతస్తులు.. మూడ ఎకరాల్లో 3.6 లక్షల చదరపు అడుగుల్లో) నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. అత్యాధునిక డిజైన్‌తో సాండ్‌ విచ్‌ ఆకారంలో దీన్ని నిర్మించారు. టీ హబ్‌ 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచచి 120 అడుగుల రహదారులను నిర్మించారు.  ఈ కార్యక్రమంలో  కేసీఆర్‌ వెంట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సైయింట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావుతో పాటు దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

 

Tags :