సీఎస్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

సీఎస్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు జగ్గారెడ్డి, అజారుద్దీన్‌ లు సీఎస్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్‌ నేతలు వినతిపత్రం అందజేశారు. ధరణిని రద్దు చేసి పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిషేధిత జాబితాలో పొరపొటుగా నమోదైన భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదే విధంగా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అర్హులకు అసైన్డ్‌ భూములు పట్టాలు ఇవ్వాలని  వినతిపత్రంలో పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.