తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో టాంజానియాలో బోనాలు

తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో టాంజానియాలో బోనాలు

తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో టాంజానియాలోని దార్‌-ఎస్‌-సలాం నగరంలో ఘనంగా బోనాలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు  ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ సాంస్కృతిక సంఘం సలహాదారు వంగ నరసింహారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సంతోష్‌ రెడ్డి, సురేందర్‌, మోహన్‌ రెడ్డి, మధురెడ్డి, చారి, ఆశ్రిత్‌ సైదులు, కుశల్‌, ప్రణీత్‌ రెడ్డి, వెంకటేశ్‌, రాజేశ్‌, సురేష్‌, రాజు కనిష్క్‌, శేషు సమీద్‌ తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మందికి పైగా తెలంగాణ ప్రవాస కుటుంబాల మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

 

Tags :