మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్

మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు.  రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, పాజిటివ్‌ నిర్ధారణ అయిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నానని మంత్రి తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్‌ టెస్టు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు.

 

Tags :