MKOne TeluguTimes-Youtube-Channel

గవర్నర్ తమిళిసై విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం

గవర్నర్ తమిళిసై విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం

గవర్నర్‌ తమిళిసై విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌  ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరపు లాయర్‌ దుశ్యంత్‌ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, గవర్నర్‌ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రసంగం నేపథ్యంలో బడ్జెట్‌ తేదీ మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. 3వ తేదీ బదులు 6వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వర్సెస్‌ తెలంగాణ  ప్రభుత్వం వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్‌ సిఫార్సులకు ఇంకా గవర్నర్‌ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఈ నాటకీయ పరిణామాల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం. 

 

 

Tags :