తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. వైద్య విద్యార్థులకు

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. వైద్య విద్యార్థులకు

తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్‌ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు  చేసింది. కాగా, వెయ్యికి పైగా ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకు ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్‌ బీ కేటగిరి సీట్లలో 85 శాతం లోకల్‌ రిజర్వేషన్ల (తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు. ఇకపై కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్‌ కోటా కింద సీట్లు ఇవ్వన్నుట్లు ఆరోగ్యశాఖ మంత్రి హారీష్‌ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు జీవో నెంబర్‌ 129, 130 లకు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్‌  సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు లభించనున్నాయి.

.

Tags :
ii). Please add in the header part of the home page.