తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ శాఖ అవసరం లేదు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ శాఖ అవసరం లేదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖను ఇక మీదట అవసరం లేదని భావిస్తూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను రహదారులు-భవనాల శాఖలో విలీనం చేసింది. గృహనిర్మాణ శాఖ ఆస్తులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆర్‌అండ్‌బీ శాఖకు బదిలీ చేసింది. పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యయంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖ తాజా నిర్ణయంతో కనుమరుగు కానున్నది.  తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధలను ప్రకారం మంత్రిత్వ శాఖలు 17కే పరిమితం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాఖల విలీనం గతంలోనే  ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ కోవలో ఒకే తరహా పనితీరు ఉన్న శాఖలను ఒకే గొడుగు కిందకు చేర్చే ప్రక్రియ కొంత జరిగింది. కొత్తగా ముఖ్యమైన శాఖలను కొనసాగిస్తూ మిగతా వాటిని విలీనం లేదా రద్దు చేయాలనే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ శాఖ రద్దు జరిగింది.

 

 

Tags :