జూన్ 17 నుండి హజ్ యాత్ర

జూన్ 17 నుండి హజ్ యాత్ర

తెలంగాణ రాష్ట్రం నుండి హజ్‌ యాత్రీకుల తొలి ఫ్లైట్‌ జూన్‌ 17న హైదరాబాద్‌ నుండి జిద్దాకు బయలు దేరనుంది. ప్రస్తుతం నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం హజ్‌ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హజ్‌ కమిటీ చైర్మన్‌ మొహమ్మద్‌ సలీం తెలిపారు. హజ్‌ కమిటీ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సలీం హజ్‌ కమిటీ సిబ్బందితో సమావేశమై సమీక్షించారు. హజ్‌ యాత్రీకులకు సేవలందించడంలో ఎలాంటి లోపం లేకుండా చూడాలని, సిబ్బంది సెలవులు పెట్టకుండా విధిగా విధులకు హాజరు కావాలని ఆదేశించారు. హజ్‌ యాత్రీకుల డాక్యుమెంట్‌ సమర్పిస్తున్న తరుణంలో పని సాఫిగా కొనసాగేలా చూడాలన్నారు. రాష్ట్రం నుండి హజ్‌ యాత్రీకుల చివరి ఫ్లైట్‌ హైదరాబాద్‌ నుండి జిద్దాకు బయలు దేరే వరకు తెలంగాణ హజ్‌ కమిటీ 24 గంటలు పనిచేస్తుందని ఆయన తెలిపారు.

 

Tags :