తెలంగాణ హైకోర్టు మరో ముందడుగు.. అక్టోబరు 10 నుంచి

తెలంగాణ హైకోర్టు మరో ముందడుగు.. అక్టోబరు 10 నుంచి

తెలంగాణ హైకోర్టు సాంకేతికంగా మరో ముందడుగు వేయనుంది. అక్టోబరు 10 నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మొదటి కోర్టు హాలులో చేపట్టే విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. దీనికి సంబంధించిన వెబ్‌లింక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. మొదటి కోర్టు హాలులో వాదనలు ప్రారంభించే ముందే  ప్రత్యక్ష ప్రసారం, రికార్డింగ్‌కు సంబంధించి ఏదైనా అభ్యంతరాలుంటే చెప్పాలని సంబంధిత న్యాయవాదికి కోర్టు అధికారి సమాచారం అందిస్తారు. ప్రత్యక్ష ప్రసారంపై కక్షిదారులు, న్యాయవాదికి అభ్యంతరాలుంటే వాటిని ధర్మాసనం దృష్టికి తీసుకువస్తే తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.