వ్యాక్సినేషన్ లో తెలంగాణ మరో మైలురాయి

వ్యాక్సినేషన్ లో తెలంగాణ మరో మైలురాయి

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయిని దాటింది. రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయింది. వైద్య సిబ్బంది కేవలం 35 రోజుల్లోనే కోటీ టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొదటి డోసు 2.93 కోట్లు, రెండో డోసు 2.06 కోట్లు. ప్రికాషన్‌ డోస్‌గా బూస్టర్‌ డోస్‌ 1.13 లక్షల డోసులు పంపిణీ చేశారు. 15`17 ఏండ్ల వారికి 8.67 లక్షల డోసులు (47 శాతం) వేశారు. మొదటి డోస్‌ లక్ష్యానికి మించి దాదాపు 103 శాతం మందికి పంపిణీ చేయగా, రెండో డోస్‌ 74 శాతం మందికి వేశారు. టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు దాటిన సందర్భంగా ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌లో కృషి చేస్తున్న వైద్యసిబ్బందితో పాటు పంచాయతీ, మున్సిపల్‌, ఇతర శాఖల సిబ్బందిని అభినందించారు.

 

Tags :