తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు

తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు

గోవా తరహా అభివృద్ధి కావాలంటే తెలంగాణలో కూడా డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు  చేసి తీరుతామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా సాగుతోందని అన్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం కలుగుతోందన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రావాలనేదే మా ఆకాంక్ష. ఆత్మనిర్బర్‌ భారత్‌ అమలుకు కృషి చేస్తున్నామన్నారు. గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు. మా రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో గోవా వచ్చి చూడండి అని అన్నారు.

వితంతు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతులకు వడ్డీలేని రుణాలు మేము కూడా ఇస్తున్నామన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ పథకాలను అందిస్తున్నాం. పంచాయతీ స్థాయిలో గెజిటెడ్‌ అధికారులు ప్రతివారం పర్యటిస్తున్నారు. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరేలా కృషి చేస్తున్నాం.  ఆయూష్‌ అభివృద్ధి కోసం జైపూర్‌లో రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటును అభినందిస్తున్నామన్నారు.  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గోవా ఎన్నికల్లో బాగా పని చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల  14న తెలంగాణకు రాబోతున్నారని తెలిపారు.

 

Tags :