టీప్యాడ్‍ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

టీప్యాడ్‍ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్‍ ఆఫ్‍ డల్లాస్‍ (టీపీఏడీ) ఆధ్యర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనేందుకు 51 మంది పేర్లు నమోదు చేసుకోగా 30 పింట్స్ రక్తాన్ని సేకరించారు. అనురాధ మేకల, మామిడి రవికాంత్‍, సుంకిరెడ్డి మాధవి, రావు కల్వల, గోలి బుచ్చిరెడ్డిలతో పాటు టీప్యాడ్‍కి చెందిన అనేక మంది ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడంతోపాటు వివిధ సేవా కార్యక్రమాలు టిప్యాడ్‍ నిర్వహిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని ఫ్రిస్కో, ప్లానో, అలోనో, కొప్పెలో తదితర ప్రాంతాలకు చెందిన యువతకు టీప్యాడ్‍ కల్పిస్తోంది. రక్తదాన శిబిరం నిర్వహాణకు సహాకారం అందించిన ఐటీ స్పిన్‍ కంపెనీకి టీప్యాడ్‍ ధన్యవాదాలు తెలిపింది.

 

Tags :