తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖరారు...

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక లేదా సోనియా గాంధీ ఒక రోజు యాత్రలో పాల్గొనేలా సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు. ఈ నెల 26న భద్రచలం నుంచి లాంఛనంగా యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఠాక్రే సమావేశానికి 3 సార్లు రానివారి నుంచి వివరణ తీసుకుంటామని, కీలక సమావేశానికి హాజరుకాని వారిని పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు నాగర్ కర్నూల్లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని తెలిపారు.
Tags :