అందుకు యూఎస్ అమ్మాయి నిదర్శనం : జూలూరు గౌరీశంకర్

అందుకు యూఎస్ అమ్మాయి నిదర్శనం : జూలూరు  గౌరీశంకర్

తెలుగు భాష అభ్యున్నతికి యువత కృషి చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీ శంకర్‌ పిలుపునిచ్చారు. నేటి యువత ఆంగ్ల మాధ్యమంలో చదువుతూ తెలుగు భాషకు దూరం అవుతున్న ఈ సందర్భంలో ఒక విదేశీయురాలు తెలుగు భాష మీద ఇష్టంతో సొంతంగా తెలుగు రాయడం, చదవడం నేర్చుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. యుఎస్‌కు చెందిన బ్రీ అనే విదేశీయురాలు తెలుగు భాషకు చేస్తున్న కృషిని గుర్తించి గౌరీశంకర్‌ ఆమెను రవీంద్రభారతికి ఆహ్వానించి అభినందించారు. ఈ సస్త్రందర్భంగా ఆయన మాట్లాడుతూ  తేనె కంటే మధరంగా ఉన్న తెలుగు భాష మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందుతోందన్నారు. తెలుగు భాషను నేర్చుకోవడానికి ఎంతో మంది విదేశీయులు తహతహలాడుతున్నారని అందుకు యుఎస్‌ అమ్మాయి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మాండి హరికృష్ణ పాల్గొన్నారు.

 

Tags :