పదో తరగతి పరీక్షలపై ..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది గానూ ఉర్దూను సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ను పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పది పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

 

Tags :