3డీ ప్రింటింగ్ పరిశ్రమకు వేదికగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

3డీ ప్రింటింగ్ పరిశ్రమకు వేదికగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

రానున్న రోజుల్లో 3డీ ప్రింటింగ్‌ పరిశ్రమకు హైదరాబాద్‌ వేదిక కానుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. యామ్‌ టెక్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఈ సంద్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ 3డీ ప్రిటింగ్‌, ఆవిష్కరణల రంగంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధి చేసి విదేశాలకు అందిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడికల్‌, పరిశ్రమ, రంగాల్లోనూ ఈ త్రీడీ ప్రిటింగ్‌ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు  తెలిపారు. రానున్న రెండు రోజులు దేశ విదేశాలకు చెందిన 100కు పైగా పరిశ్రమలు, 50కి పైగా స్టార్టప్‌లు, 15కు పైగా నేషనల్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, 3000 మందికి పైగా ప్రతినిధులు  ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారని తెలిపారు.

 

Tags :