దేశంలో తొలిసారిగా.. తెలంగాణ, ఉత్తరాఖండ్ లో

దేశంలో తొలిసారిగా.. తెలంగాణ, ఉత్తరాఖండ్ లో

మహిళలు, పిల్లలు, వృద్ధులు కోర్టులకు వచ్చి సాక్ష్యం చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారి వద్దకే వెళ్లి సాక్ష్యాలు సేకరించేందుకు, రికార్డు చేసేందుకు తెలంగాణ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు మొబైల్‌ కోర్టులను ప్రారంభించనున్నాయి. ఇలాంటి మొబైల్‌ కోర్టులను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారని కేంద్ర న్యాయశాఖ వెల్లడిరచింది. ఇది జిల్లాల్లో సబార్డినేట్‌ కోర్టులకు అదనంగా పని చేస్తుందని తెలిపింది. మొబైల్‌ కోర్టు యూనిట్లలో సీసీటీవీ కెమెరాలు, ల్యాప్‌టాపులు, ప్రింటర్‌, ఎల్‌ఈడీ టీవీ, వెబ్‌ కెమెరా, ఇన్వర్టర్‌, స్కానర్‌, యూపీఎస్‌, స్పీకర్‌, మానిటర్‌ ఉంటాయి. మొబైల్‌ కోర్టు వెసులుబాటు నిందితుడికి కూడా వర్తిస్తుంది. నిందితుడికి ప్రాణాహాని ఉందనుకొన్నప్పుడు దీనిని వినియోగించుకోవచ్చు.

 

Tags :