కాన్సస్ నగర తెలుగు సంఘం రజతోత్సవం సక్సెస్

కాన్సస్ నగర తెలుగు సంఘం రజతోత్సవం సక్సెస్

తెలుగు అసోసియేషన్‍ ఆఫ్‍ గ్రేటర్‍ కాన్సస్‍ సిటిని స్థాపించి 25 ఏళ్లు పూర్తవడంతో రజతోత్సవ సంబరాలు ఆగస్టు 28న నిర్వహించారు. దుర్గా తెల్ల, అంజనీ దేవి, సరిత రాయన, మంజుల సువ్వారి, శిరీష టేకులపల్లి, లక్ష్మీ నాయుడు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‍ శ్రీకాంత్‍ రావికంటి ప్రారంభోప న్యాసం చేశారు. రజతోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నవారు తమ తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. 25 ఏళ్లుగా సంఘా నికి సేవలందించిన అధ్యక్షులు, ట్రస్ట్ బోర్డు ఛైర్‍పర్సన్లు, వారి జీవిత భాగ స్వాములను సత్కరించి జ్ఞాపికలను అంద జేశారు. పూర్వ అధ్యక్షులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు. 35 ఏళ్లుగా స్థానిక తెలుగు వారికి, సంఘానికి సేవలంది స్తున్న లక్ష్మీ నాయుడును జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. సాంస్క•తిక కార్యక్రమాల్లో స్థానిక గాయకులు విశ్వ మోహన్‍ అమ్ముల, నిధి రావు పాటలతో అలరించారు. అధ్యక్షుడు శరత్‍ టేకులపల్లి తన ఉపన్యాసంలో సంఘం చేసిన సాహితీ, సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

 

Tags :