తానా ఆధ్వర్యంలో ‘అమెరికా గ్రంధాలయాల్లో తెలుగు పుస్తకాలు’ ప్రారంభం

తానా ఆధ్వర్యంలో ‘అమెరికా గ్రంధాలయాల్లో తెలుగు పుస్తకాలు’ ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘అమెరికా గ్రంధాలయాల్లో తెలుగు పుస్తకాలు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఉన్న 25 ప్రముఖ లైబ్రరీల్లో తెలుగు పుస్తకాలను ఉంచనున్నారు. మొత్తం నలభై తెలుగు పుస్తకాలను ఈ లైబ్రరీలకు అందజేస్తున్నట్లు తానా వెల్లడించింది. డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సహకారంతో భగవద్గీత, పెద్దబాల శిక్ష, రామాయణం, శ్రీమదాంధ్ర మహాభారతం, భాగవతం, ఐదు వేల వేమన పద్యాలు, 450 నీతి పద్యాలు, అమ్మ భాషలో ప్రాథమిక విద్య, బాల వ్యాకరణం, పండుగల ప్రాముఖ్యత, పంచతంత్ర కథలు, తెనాలి రామకృష్ణ కథలు, కన్యాశుల్కం, అక్షర అభిషేకం, ఆంధ్ర ప్రశస్తి, మన తెలంగాణా, కౌటిల్యుని అర్థశాస్త్రం, చలం నాటకాలు, విజయానికి ఐదు మెట్లు, బ్రౌనీ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు, బాపు బొమ్మల పంచతంత్రం, చందమామ కథలు (1-7 సంపుటాలు), ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ, బాపు కార్టూన్స్, బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు, 100 హాస్యాన్వేషణ, సాగర ఘోష, హస్త సాముద్రిక శాస్త్రం, మైదానం, కథ చాణక్య, ఇది నా గొడవ, నో ప్రాబ్లం, 555 సురుచి వంటకాలు తదితర పుస్తకాలను లైబ్రరీలకు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాజీ చైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కల సాకారం చేయడానికి కృషి చేసిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, నరేన్ కొడాలి, శ్రీనివాస్ గోగినేని, డెట్రాయిట్ తానా బృందం అందరికీ తెలుగు ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.